దుర్గి: నిదానంపాటి అమ్మవారి సేవలో ఎమ్మెల్యేలు
దుర్గి మండల పరిధిలోని నిదానంపాటి గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, చదలవాడ అరవింద బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు.