విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 20వ తేదీన సూపరింటెండింగ్ ఇంజినీర్ కార్యాలయంకు సామూహిక రాయబారం నిర్వహించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె. రాజశేఖర్, శనివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు రెండ్రోజుల పాటు గుంటూరు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విద్యుత్ రంగం సదస్సులో తీర్మానించారు.