గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవితేజ తనను మోసం చేశాడంటూ ఓ నర్సింగ్ విద్యార్థిని శనివారం స్పందనలో ఫిర్యాదు చేసింది. ఐద్వా కార్యకర్తలతో కలిసి స్పందనకు వచ్చి యువతి ఫిర్యాదు చేసింది. పెళ్ళి పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకోనని చెబుతున్నాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది.