వైసీపీ అధినేత జగన్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మంత్రి లోకేశ్ ను పాటు మరో నలుగురి పై వైసీపీ శ్రేణులు మంగళవారం పట్టాభిపురంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ తమ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లే తాము ఫిర్యాదు చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలన్నారు. లోకేశ్ ను అరెస్ట్ చేసి చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు.