విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ తోనే బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ క్యాబినెట్ సమావేశంలో విద్యారంగ సమస్యలపై చర్చించాలని, జీవో నంబర్-77 రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని అన్నారు.