గంజాయి సాగు, తరలింపులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ మంత్రి అనిత తెలిపారు.గురువారం అసెంబ్లీ లో9వ రోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి కట్టడిపై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి వ్యవహారాలపై సమీక్ష జరగలేదని, ప్రభుత్వం అండతో దుండగులు రెచ్చిపోయారని ఆరోపించారు.