రాష్ట్రంలో మహిళల పై దాడులు జరగకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బ్రెయిన్ డెడ్ అయి మృతిచెందిన తెనాలి యువతి సహానా మృతదేహాన్ని బుధవారం సీపీఐ శ్రేణులు జీజీహెచ్ లో పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబంతో మాట్లాడి ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.