భారత నిర్మాణ సారథి నెహ్రూజీ' అనే అంశంపై నవంబర్ 6న చర్చా గోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు ఎన్. తులసీరెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేశ్ అతిథులుగా హాజరవుతారన్నారు.