ప్రపంచ పోలియో నిర్మూలన దినోత్సవాన్ని గుంటూరులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలియో మహమ్మారి నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని అన్నారు. పోలియో నిర్మూలనలో ప్రజలకు కూడా భాగస్వాములు కావాలని సూచించారు.