వైసీపీ నగర అధ్యక్షుడు డైమండ్ బాబు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి అనుమతులు లేకపోవడంతో ఆదివారం కేసు నమోదు చేసినట్లు పాతగుంటూరు పోలీసులు తెలిపారు. కాకాని రోడ్డు నుంచి విజ్ఞాన మందిరం వరకూ ర్యాలీ నిర్వహించిన క్రమంలో బస్టాండ్ వద్ద ఓ కారు రోడ్డుపై ఆపడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడిందని అన్నారు. దీంతో కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.