ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి: గుంటూరు ఎస్పీ

75చూసినవారు
ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి: గుంటూరు ఎస్పీ
గుంటూరు జిల్లాలో ర్యాలీలు, ఊరేగింపులకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. కొంతమంది ర్యాలీలు, ఊరేగింపు సమయాల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఎస్పీ తెలిపారు. ముందస్తు అనుమతి తీసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోమవారం స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్