ఈ నెల 11న జీఎంసీలో వీధి వ్యాపారులతో సమావేశం: కమిషనర్

71చూసినవారు
ఈ నెల 11న జీఎంసీలో వీధి వ్యాపారులతో సమావేశం: కమిషనర్
గుంటూరు నగరంలో వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు కౌన్సిల్ సమావేశ మందిరంలో వీధి వ్యాపారుల సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాసులు శనివారం తెలిపారు. వర్షాలు పడినప్పుడు ఆక్రమణలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. వ్యాపారులు ఈ సమావేశంలో పాల్గొనాలని సూచించారు.

సంబంధిత పోస్ట్