సేవా తత్పరుడు మెగాస్టార్: ఆళ్ల హరి

56చూసినవారు
సేవా తత్పరుడు మెగాస్టార్: ఆళ్ల హరి
గుంటూరులో గురువారం చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి ఆ పార్టీ నాయకులు, చిరంజీవి అభిమానులతో కలిసి కేకును కోసి పంచి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి అందరికీ ఆదర్శనీయులన్నారు. రక్తదానం తదితర సేవా కార్యక్రమాలతో అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారన్నారు.

సంబంధిత పోస్ట్