దాచేపల్లి పోలీసు స్టేషన్ లో దాచేపల్లి సిఐ భాస్కర్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాచేపల్లి పట్టణ, మండల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు , ఇతర చట్ట విరుద్ద కార్యక్రమాలకు అనుమతి లేదని , ఎవరైనా చట్టాన్ని అతిక్రమించిన యెడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.