తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డిలు శుక్రవారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్రంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతుల ఇంట సిరిసంపదలు నిండి ఉండాలని ఆ కలియుగ దైవాన్ని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్పారు.