డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మాచవరం మండలంలోని సరస్వతి పవర్ అండ్ సిమెంట్ కంపెనీ భూములను పరిశీలించినట్లు మాచవరం ఎమ్మార్వో యం. క్షమారాణి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో ఈ కంపెనీ కింద 1077. 38 ఎకరాలు ఉన్నాయన్నారు. వాటిలో 821. 44 ఎకరాలు ఆన్లైన్ అయ్యాయన్నారు. 255. 94 ఎకరాలు ఆన్లైన్ కావలసి ఉందని తహశీల్దార్ తెలిపారు.