2026 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు

72చూసినవారు
2026 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. 2026 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని వెల్లడించారు. గురువారం ఆయన పోలవరం పనులు పరిశీలించిన అనంతరం మీడియా సమక్షంలో మాట్లాడారు. 'విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పెట్టారు. 400 TMCలు వాడుకుంటే ఏపీని కరవురహితం చేయవచ్చు. 7 మండలాలు తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు. రెండు రాష్ట్రాలు ఏర్పడడానికి జూన్‌ 2 డెడ్‌లైన్‌గా ఉందని' సీఎం పేర్కొన్నారు .

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్