కారంపూడి: ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు చేపట్టండి
కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామం ఎస్సీ కాలనీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన కోట నాగభూషణం అనే వ్యక్తి ఆక్రమించాడని గ్రామస్తులు బుధవారం ఆరోపించారు. నకిలీ డీకే పట్టాలు పుట్టించాడంటూ డిప్యూటీ తహశీల్దార్ కు బుధవారం పలువురు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 337/3 సీబీ లో 16. 10 ఎకరాల్లోని కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమ్మకాలు చేశారని వారు ఆరోపించారు. అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.