Feb 21, 2025, 10:02 IST/
గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థులను పిలిచి చర్చించండి: షర్మిల
Feb 21, 2025, 10:02 IST
AP: రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై ఆందోళనలు చేస్తున్న గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకొని, చర్చించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. 'గ్రూప్-2 మెయిన్స్ కి అర్హత సాధించిన 92,250 మంది అభ్యర్థుల తరుపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు' అని, వారికి న్యాయం చేయాలని షర్మిల ట్వీట్ చేశారు.