ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి మేనిఫెస్టో లక్ష్యం - ఎమ్మెల్యే ఏలూరి

1530చూసినవారు
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కూటమి మేనిఫెస్టో లక్ష్యం - ఎమ్మెల్యే ఏలూరి
ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బిజెపి అద్భుతమైన మేనిఫెస్టో రూపకల్పన చేసిందని కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో తిమ్మరాజుపాలెం నుంచి 20 కుటుంబాలు వలపర్ల నుంచి 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆడబిడ్డ నీది కింద ప్రతి మహిళకు నెలకు 15000 చొప్పున అందించడం జరుగుతుందన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు డ్వాక్రా కింద పది లక్షల వరకు సున్నా వడ్డీ అమలు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం ఇచ్చే విధంగా బాధ్యత తీసుకుంటామన్నారు. మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేస్తామని ఐదేళ్ల 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు ప్రతినెల 3000 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని బీసీ డీక్లరేషన్లో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. ఎన్టీఆర్ పెన్షన్ అమలు చేస్తే దానిని తెలుగుదేశం 200 ఉన్న పెన్షన్ 2000 చేయడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగువేల పెన్షన్ అందిస్తామని ఏప్రిల్ నుండే అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి 25 లక్షల ఆరోగ్య భీమా అమలు చేయడం కోసం కూటమి ప్రత్యేక మేనిఫెస్టో కూటమి రూపొందించింది అన్నారు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు బీమా అందిస్తామన్నారు. జే బ్రాండ్స్ రాష్ట్రంలో నిలిపివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ సోదరులకు తీరని అన్యాయం చేసిందన్నారు. సరైన ఆర్థిక ప్రణాళిక లేని వైసిపి ప్రభుత్వం బీసీలకు రావాల్సిన వాటా నిధులని దారి మళ్ళించిందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీసీలను అక్కున చేర్చుకున్నారు. బీసీలకు ఆదరణ లాంటి పథకాలను తీసుకువచ్చి ఆదుకున్నాం . బీసీ కార్పొరేషన్ ద్వారా 50% సబ్సిడీతో లోన్లు ఇప్పించిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ విదేశీ విద్య ద్వారా వేలాది మంది విద్యార్థుల విదేశీ విద్య కలలు నెరవేర్చిందన్నారు. బీసీ బిడ్డలకు చంద్రన్న పెళ్లి కానుక అందించి ఆదుకున్నామన్నారు. చదువుకున్న బీసీ యువతకు ఏపీ స్టడీ సర్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఉపాధి కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. ప్రస్తుత జగన్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల లో రిజర్వేషన్లు తగ్గించి రాజ్యాంగబద్ధ పదవులను దూరం చేసిందన్నారు.కూటమి అధికారంలోకి రాగానే బీసీలకు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించడం ఆదరణ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించడం బీసీ జన గణన చేపట్టడం చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందన్నారు.అలాగే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఎలా ఉందో బీసీలకు కూడా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకువస్తామన్నారు. బీసీ బిడ్డలకి చంద్రన్న పెళ్లి కానుక, చదువుకున్న బీసీ యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా స్కిల్స్ నేర్పించి ఉపాధి కల్పిస్తామన్నారు. పర్చూరు నియోజకవర్గంలో సైకిల్ గుర్తుకి తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు
తెలుగుదేశం పార్టీలో చేరికలు ఇలా
వలపర్ల:
వలపర్ల గ్రామానికి చెందిన వైసిపి నాయకులు పలువురు ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో మూకిరి రాంబాబు,మూకిరి కిషోర్, మూకిరి దేశిబాబు,మూకిరి లాజర్, మూకిరి ఎలీషా,గంటెనపల్లి సుబ్బారాయుడు, మూకిరి జయరాజు, బూరగ అంకమ్మరావు
తిమ్మరాజుపాలెం:
ఇంటూరి శ్రీనివాసరావు,కుక్కపల్లి నాగేశ్వరరావు, బాలినేని నాగేశ్వరరావు, బాలినేని పోతురాజు,చింతల పాపారావు, మానం ఆంజనేయులు,మానం కృష్ణ, కుల్లూరి రాజేష్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్