వందలాది ఎకరాల్లో దట్టంగా అల్లుకుపోయే మడ చెట్ల సమూహాన్ని మడ అడవులుగా పిలుస్తారు. ఇవి ఈ ఇవి నీట మునిగినా చనిపోవు. వీటి వేర్లు ఉప్పు నీటిని వడపోసి మంచినీటిగా మార్చుకుంటాయి. మడ చెట్లు ముఖ్యంగా మత్స్య సంపద పెరగటానికి, సముద్ర కోతను అరికట్టడానికి, తుఫాన్లు, సునామీల తీవ్రత నుంచి తీర గ్రామాలను రక్షించటానికి సహజసిద్ద కవచాలుగా ఉపయోగపడతాయి. వాతావరణంలో కర్బన ఉద్గారాలు, కార్బన్ డై ఆక్సైడ్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.