తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ గా బ్రహ్మనాయుడు ప్రమాణస్వీకారం

69చూసినవారు
మాచర్ల రూరల్ తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ గా టిడిపి నేత పసుపులేటి బ్రహ్మనాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. గతంలో వైసిపి పార్టీకి చెందిన నేత వెంకటరామయ్య తాళ్లపల్లి సర్పంచ్ గా కొనసాగారు. అతను అనివార్య కారణాలవల్ల సర్పంచ్ పదవికి సెలవు పెట్టడం తో పసుపులేటి బ్రహ్మనాయుడు బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్