మాచర్లలో భారీ వర్షం

66చూసినవారు
మాచర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వాతావరణంలో మార్పు వల్ల మేఘావృతమై భారీ వర్షం కురవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షం రాకతో ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. చిరు వ్యాపారులు వర్షం కారణంగా షాపులను ముసివేశారు. వర్షాలకు పంట నష్టపోతామని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్