తుఫాన్ కారణంగా గత వారం రోజులుగా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలలో వర్షం కుండపోతగా కురిసింది. దీంతో పలు గ్రామాల్లో మంగళవారం ప్రధాన రహదారులు, చిన్న కుంటలు, వాగులు జలమయం అయ్యాయి. ముఖ్యంగా కొత్తపల్లి, కొప్పునూరు, తాళ్లపల్లి, చెంచు కాలనీ, ఏకోనాంపేట గ్రామాలలో ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జలమయంగా మారిన రోడ్ల నుంచే ప్రయాణికులు, వి
ద్యార్థులు ప్రయాణించారు.