పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కార్యకర్తలతో బుధవారం సమావేశమయ్యారు. మార్చి మొదటివారంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయనీ, నియోజకవర్గంలో 7250మంది పట్టభద్రులు ఉన్నారని తెలిపారు. టిడిపి సభ్యత్వాల్లో పెదకూరపాడు 3వ స్థానంలో ఉందనీ, నూతనంగా 6600మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధిస్తాడని అన్నారు.