ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను ఆదివారం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు సందర్శించారు. విజయపురిసౌత్ లోని లాంచి స్టేషన్ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలలో నాగార్జున కొండకు వెళ్లారు. నాగార్జునకొండలో నెలకొల్పిన బుద్ధుని 9 అడుగుల విగ్రహం, బుద్ధ ధాతువులు, మ్యూజియం, మాన్యూమెంటు, అశ్వమేధ యజ్ఞశాల, పాలరాతి విగ్రహాలు, దలైలామా నాటిన బోధి వృక్షంను ఎంతో ఆసక్తిగా వారు తిలకించారు.