ఎత్తిపోతలకు జలకళ.. పర్యాటకుల సందడి

51చూసినవారు
మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతలకు వరద ప్రవాహం పెరిగింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎత్తిపోతల జలకళ ను సంతరించుకుంది. ఎగువన వర్షాలు భారీగా పడుతుండటంతో వాగులు, అటవీ మార్గాల ద్వారా వరద నీరు ఎత్తిపోతలకు చేరుకుంటుంది. ఎత్తిపోతల 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తూ ఆదివారం పర్యాటకులను ఆకర్షిస్తోంది. జలపాత అందాలు చూసేందుకు సందర్శకులు ఎత్తిపోతల చేరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్