వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం కారంపూడి పట్టణంలో వైస్సార్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. కారంపూడిలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగన్ చేసిన కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.