అనంతపురం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు మంగళగిరి పట్టణ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు మంగళగిరి రైల్వే స్టేషన్ లో అనారోగ్యంతో బాధపడుతున్న వెంటేశ్వర్లును అంబులెన్స్ లో గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మంగళగిరి పోలీసులను సంప్రదించాలని కోరారు.