మంగళగిరి స్టేషన్ కి హాజరైన జోగి రమేష్

75చూసినవారు
తాడేపల్లి ఉండవల్లి కరకట్ట లోని చంద్రబాబు నాయుడు నివాసంపై నాడు జరిగిన దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ జోగి రమేష్ కు మంగళగిరి రూరల్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం జోగి రమేష్ తో పాటు మాజీ ఏజిపి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి లు డిఎస్పీ మురళీకృష్ణ ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు జోగి రమేష్ సమాధానాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్