జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కర్నూల్ జిల్లా ఆదోని నుండి మంగళగిరి జనసేన కార్యాలయానికి 487 కి.మీ సైకిల్ యాత్ర చేస్తున్న రాజేశ్వరి అనే వీర మహిళను పూలమాలతో స్వాగతించాలని ఆదేశించారు. ఆమె తమ ప్రాంత సమస్యలు గురించి పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు వస్తున్నట్లు సమాచారం. జనసేన కార్యకర్తలు ఈ యాత్రను సోషల్ మీడియాలో పంచుకోగా..ఈ సందర్భంగా.. పార్టీ కార్యాలయానికి వచ్చే ఆ వీర మహిళకు పూలమాలతో స్వాగతం పలకాలని జనసేన కార్యాలయానికి సూచించారు.