పవన్ కళ్యాణ్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి

71చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందనే కథనంపై జనసేన మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్పందించారు. మంగళగిరి కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ పవన్ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని అటువంటి వ్యక్తికి విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం ఉందని అన్నారు. వెంటనే పవన్ కు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్