గుడ్లవల్లేరు కాలేజీలో వీడియోల రికార్డింగ్‌పై నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి ఈ ఘటనపై తనకు రిపోర్ట్ చేయాలని అధికారులకు చెప్పారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్‌గా స్పందించి నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. విద్యార్థుల ఫిర్యాదును కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలని ఆదేశించారు.