కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' ప్రదర్శనను తెలంగాణలో నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. దీనిపై న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ చిత్ర పదర్శనపై నిషేధం కోరుతూ తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం గురువారం షబ్బీర్ అలీని కలిసింది. సినిమాలో సిక్కు సమాజాన్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని పేర్కొంది.