నరసింహుని సేవలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల

58చూసినవారు
నరసింహుని సేవలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల
మంగళగిరి నగరంలో వేంచేసిఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత లక్ష్మీ నరసింహుడు అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఎమ్మెల్యేకి స్వామివారి జ్ఞాపికని అందజేశారు. కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘం నేతలు బాలాజీ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్