తాడేపల్లి మండల పరిధిలోని నవోదయ కాలనీ, క్రిస్టియన్ పేట, వీఆర్ అపార్టుమెంట్ తదితర ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ సురేష్ బాబు తెలిపారు. శనివారం ఉదయం 9. 30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.