గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు గ్యాస్ట్రో ఎంటరాలజీలో నిపుణులైన షేక్ నాగూర్ బాషా గుంటూరు జీజీహెచ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా శుక్రవారం నియమితులయ్యారు. ఈయన 2007లో ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేసి, 2013లో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేశారు. 2016లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి డీఎం గ్యాస్ట్రోఎంటరాలజీ పూర్తి చేసి 2020లో జీజీహెచ్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు.