AP: రాష్ట్రంలో ఆకల వర్షాలతో పాటు ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో APSDMA కీలక ప్రకటన చేసింది. రేపు 52, ఎల్లుండి 88 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూ.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. అలాగే పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతోపాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.