దక్షిణా గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. 26 మంది మృతి

81చూసినవారు
దక్షిణా గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. 26 మంది మృతి
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ తరుచు దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాలోని ప్రముఖ ఆసుపత్రిపై దాడికి తెగబడింది. ఈ దాడుల్లో హమాస్ సీనియర్ నాయకుడితో సహా 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఖాన్ యూనిస్ నగరంలోని నాసర్ ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని తాజాగా దాడి జరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్