పల్నాడు జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సత్తిరాజు బుధవారం ఎస్పీ కంచి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి పల్నాడుకు వచ్చినట్లు తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, ప్రజల రక్షణ, భద్రత కొరకు కృషి చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణ కొరకు పాటుపడాలని ఎస్పీ సూచించారు.