రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో పని చేసి జిల్లా ప్రజలు ప్రమాద రహిత దీపావళి వేడుకలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సోమవారం కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు. నరసరావుపేట కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. నివాస ప్రాంతాలకు దూరంగా, బహిరంగ ప్రదేశాల్లో తాత్కాలిక టపాసుల షాపులకు అనుమతులు ఇవ్వాలన్నారు. ఎంపిక చేసిన స్థలాల్లో పరిమితికి లోబడి షాపులకు అనుమతులు ఆదేశించారు.