తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన ఐదు నెలల్లో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. బుధవారం స్థానిక సాయి నగర్ లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా మురికి కాలువలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.