నరసరావుపేటలో పారిశుద్ధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. మంగళవారం ఆయన మల్లమ్మ సెంటర్ వద్ద పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్లాక్ అయిన కాలువలను దగ్గర ఉండి ఎమ్మెల్యే శుభ్రం చేయించారు. ఈ మేరకు మున్సిపాలిటీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కార్మికులతో కాసేపు ముచ్చటించారు.