పల్నాడు జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవా పథకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి. అరుణ్ బాబు హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా క్రమశిక్షణ సంఘం సమావేశం నిర్వహించారు. కొన్ని ఆసుపత్రులలో రోగనిర్ధారణ నిమిత్తం డా. ఎన్టీఆర్ వైద్య సేవ లబ్దిదారులైన రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.