క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఆస్తి పంపకాల నేపథ్యంలో ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మున్ని (48), అబ్దుల్ బాసిక్ (25)కు బలమైన గాయాలయ్యాయి. మరొక వర్గానికి చెందిన బాజీ(56), బాషా(30) కూడా గాయపడటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.