అమరావతి మండల పరిధిలో ధరణికోట గ్రామంలో కోతులు విపరీతంగా సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని గ్రామస్థులు వాపోయారు. శుక్రవారం వారు మాట్లాడుతూ గ్రామంలోని గృహాల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నాయన్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కోతులను గ్రామం నుంచి దూర ప్రాంతాలకు తీసుకువెళ్లే విధంగా ఏర్పాట్లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.