అచ్చంపేట మండల కేంద్రమైన అచ్చంపేటలోని చామర్రు రోడ్డులో పేదల ఇళ్ల కూల్చివేతలు బుధవారమూ కొనసాగుతూనే ఉన్నాయి. రెవెన్యూ, పోలీస్, ప్రత్యేక బలగాలతో పోలీసులు మోహరించారు. తొలుత ఇళ్లకు విద్యుత్ వైర్లు తొలగించారు. అనంతరం మూడు పొక్లెయినర్లతో కూల్చివేత చేపట్టారు. పాక్షికంగా పడగొట్టిన రెంటపాళ్ల పుల్లమ్మ ఇల్లు బుధవారం పూర్తిగా కూల్చేస్తుండడంతో ఆమె రెవెన్యూ అధికారులను వేడుకుంటూ సొమ్మసిల్లి పడిపోయారు.