ఎరువుల కొరత, అధిక ధరలు నియంత్రించాలని పెదనందిపాడులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకటశివరావు పేర్కొన్నారు. బుధవారం పెదనందిపాడులో మీడియాతో మాట్లాడారు. రబీ సీజన్లో రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సొసైటీలలో స్టాకు లేదని, ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. వారిని నియంత్రించాలని కోరారు.