భారీ వర్షాల కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని జడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీన అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కొలకలూరు, హాఫ్ పేట, కాజీపేట తదితర గ్రామాల్లో నీట మునిగిన పంటపొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. తొలుత కాజీపేటలో ముంపుకు గురైన కాలనీలో పర్యటించారు.