కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య

67చూసినవారు
కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య
TG: కడుపునొప్పి భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి గురువారం తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మృతితో నాగలక్ష్మి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

సంబంధిత పోస్ట్